అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను
హదీసు
స్వప్నం చూడకుండానే చూశానని చెప్పుట
కొందరు సులభంగా ప్రఖ్యాతి పొందుటకు, పేరు తెచ్చుకొనుటకు, ఇతరుల సొమ్ము చేజిక్కించుకొనుటకు లేక తన శతృవుల్ని భయపెట్టుటకునూ అసత్య కలల్ని వినిపిస్తారు. కొందరు మూర్ఖులు ఇలాంటి అసత్య స్వప్నాలను గాఢంగా విశ్వసిస్తారు. కనుక అలాంటి వారికి అసత్య కలల్ని వినిపించి వారిని మోసగించడం జరుగుతుంది. ఇలా కలలు చూడకుండానే చూశానని చెప్పేవానికి కఠిన హెచ్చరిక వినిపించారు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం):
"తనకు జన్మనిచ్చిన తండ్రిని గాక ఇతరుల్ని తండ్రి అనుట. చూడని స్వప్నాన్ని చూసినట్లు చెప్పుట. ప్రవక్త చెప్పని మాటను ఆయన చెప్పారని ఒక మాటను ఆయన వైపు ఆపాదించుట, ఇవన్నీ అసత్యాల్లో అతి పెద్ద అసత్యాలు." (బుఖారీ 3509)
మరో హదీసులో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఇలా చెప్పారు
"చూడని స్వప్నాన్ని చూశానని అబద్ధం చెప్పేవానికి, ప్రళయదినాన రెండు బార్లి / తోక గోధుమ గింజలు కలిపి ముడివేయమని శిక్ష ఇవ్వబడును." (బుఖారీ 7042)
No comments:
Post a Comment