అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను
🌷 దుస్తులు చీలమండలం క్రిందికి ఉంచుట🌷
🚫 నిషిద్ధములు 🚫
ప్రజలు దీన్ని చిన్నదిగా, విలువ లేనిదిగా భావిస్తారు, కాని అల్లాహ్ దృష్టిలో పెద్ద పాపాలుగా ఉన్న వాటిల్లో ఒకటి. అంటే లుంగి, ప్యాంట్ వగైరా చీలమండలం క్రిందికి ఉంచుట. కొందరి దుస్తులు నేలకు తాకుతాయి. మరికొందరివి భూమిపై వ్రేలాడుతుంటాయి. అబూజర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసులో ఇలా ఉంది:
"మూడు రకాల వ్యక్తులున్నారు. అల్లాహ్ వారితో సంభాషించడు. దయాభావంతో కన్నెత్తి చూడడు. వారిని పరిశుద్ధులు చెయ్యడు. వారికి తీవ్రమైన శిక్ష విధిస్తాడు: తన లుంగి (ప్యాంటు...)ను చీలమండలానికి క్రింది వరకు ఉంచేవాడు. ఉపకారం చేసి మాటిమాటికి చెప్పుకునేవాడు, దెప్పి పొడిచేవాడు, తన సరుకును అసత్య ప్రమాణాలతో అమ్మేవాడు." (నసాయి 5333, ముస్లిం 106)
కొందరు, నేను గర్వకారణంగా తొడగడము లేదు అని చెప్పి తన పవిత్రతను చాటుకుంటాడు. కాని అతని మాట చెల్లదు. గర్వము ఉద్దేశ్యము ఉన్నా లేకపోయినా అన్ని స్థితుల్లో అది నిషిద్ధము. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఈ హదీసును గమనించండి:
"ఎవరి లుంగి (ప్యాంటు వగైరా) చీలమండలము క్రిందికున్నదో (ఆ పాదం) నరకాగ్నిలో కాలును." (అబూదావుద్ 4093, నసాయి 5330, సహీహుల్ జామె 5595, బుఖారీ 5787, ముస్లిం 832)
ఒక వేళ గర్వంతో క్రిందికి వదిలితే, దాని శిక్ష ఇంకా పెద్దది, భయంకరమైనది. అదే తరహా సృష్టీకరణ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ ప్రవచనంలో ఉంది:
"ఎవరైతే తన బట్టల గర్వంతో ప్రేలాడదీస్తారో, ప్రళయదినాన అల్లాహ్ అతని వైపు చూడడు." (తిర్మిజీ 1731, అబూదావూద్ 4085, అహ్మద్: 6/254, బుఖారీ 3665, ముస్లిం 2585)
ఎందుకనగా అందులో రెండు రకాల నిషిద్ధత కూడి ఉంది. ఒకటి గర్వం; రెండవది చీలమండలము క్రిందికి ధరించడం. దీన్నిబట్టి ఇది కూడా తెలుస్తుంది : చీలమండలం క్రిందికి ఉంచడము యొక్క నిషిద్ధత అన్ని రకాల దుస్తులపై ఉంది. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు మర్‌ఫు ఉల్లేఖించారు:
"లుంగీ, కమీజు మరియు తలపాగని చీలమండలము క్రింది వరకు ఉంచుట యోగ్యము కాదు. వీటిలో ఏ ఒక్కటిని ఎవడైతే భూమిపై వ్రేలాడతీస్తాడో, ప్రళయదినాన అల్లాహ్ వారివైపు చూడడు." (అహ్మద్, అబూదావూద్ 4094, బుఖారీ 3665, ముస్లిం 2085)
గాలికి లేచి 'బేపర్దా' కాకుండా స్త్రీ తన దుస్తులను తన చీలమండలానికి ఒక జానెడు క్రింది వరకు ఉండనీయవచ్చును. కాని దానికంటే క్రిందికి ఉంచుట యోగ్యము కాదు. కొందరు పెళ్ళికూతుళ్లు ధరించే దుస్తులు మీటర్ కంటే ఎక్కువ క్రిందికి ఉంటాయి. ఒక్కోసారి దానికంటే పొడుగ్గా ఉంటాయి. వెనుక ఉన్నవారు ఎత్తిపట్టుకోవాల్సి వస్తుంది. ఇలా యోగ్యము కాదు.
No comments:
Post a Comment