అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను
శిరోజాలను నల్లని వన్నెతో మార్చుట
శిరోజాలను నల్లని వన్నెతో రంగరించుట నిషిద్ధము. ఎందుకనగా దీని గురించి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కఠినంగా హెచ్చరించారు:
"చివరి కాలంలో ఒక జాతివారు తమ శిరోజాలను పావురం గదువ క్రింద ఉన్నట్లు నల్లని రంగులో రంగరిస్తారు. వారు స్వర్గము యొక్క పరిమళాన్ని అస్వాదించలేరు." (అబూదావూద్ 4212, సహీహుల్ జామె 8153)
తెల్ల వెంట్రుకలు వచ్చిన చాలా మంది నల్లని వన్నెతో రంగరిస్తారు. ఇది ఎన్నో చెడులకు దారి తీస్తుంది. తన వాస్తవికతపై ముసుగు వేసి, ప్రజల్ని మోసగించి తనకు తాను బూటకపు తృప్తి పొందుట. వాస్తవంగా ఇది తన వ్యక్తిత్వం మరియు తన నడవడికపై చెడు ప్రభావము చూపుతుంది. తనకు తాను ఒక మోసంలో పడి ఉంటాడు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పసుపుపచ్చ లేక ఎరుపు లేక బ్రౌన్ కలర్ మైదాకు ఉపయోగించేవారు. మక్కాను జయించిన రోజు (అబూబకర్ సిద్ధిఖ్ (రజి) తండ్రి అబూ ఖుహాఫాను తీసుకువచ్చారు. వారి తల మరియు గడ్డపు వెంట్రుకలు తెల్లగా ఉండి ఒక తెల్లని పువ్వుల గుచ్చమాదిరిగా ఏర్పడటం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చూసి "వారి శిరోజాలను (మైదాకుతో) రంగరించుకోండి. కాని నల్లని రంగుతో దూరముండండి" అని సెలవిచ్చారు. (అబూదావుద్ 4204, నసాయి 5242, ముస్లిం 2102)
స్త్రీలు కూడా పురుషుల్లాగా నల్లని రంగులో రంగరించకూడదు.
No comments:
Post a Comment