Hellobar

Monday, December 20, 2021

జీవ ప్రాణుల ఫోటోలు తీయుట

 

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను

జీవ ప్రాణుల ఫోటోలు తీయుట


                  ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారని, అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రజి) ఉల్లేఖించారు: "అల్లాహ్ వద్ద అందరికన్న ఎక్కువ కఠినమైన శిక్ష పొందేవాడు, ఫోటోలు తీయువాడు, చిత్రాలు చిత్రించేవాడు."(నసాయి - 5364, బుఖారీ - 2109, 5950, ముస్లిం - 5364)

                 అబూహురైరా (రజి) ఉల్లేఖన ప్రకారం అల్లాహ్ ఆదేశించాడని ప్రవక్త (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉపదేశించారు : "నేను పుట్టించినట్లు పుట్టించే ప్రయత్నం చేసేవానికన్నా ఎక్కువ దుర్మార్గుడు మరెవ్వడు కాగలడు. అయితే (నా చాలెంజ్ ఉంది) ఒక్క ధాన్యపు గింజైనా మరియు ఒక్క రవ్వగింజైనా పుట్టించండి." (బుఖారీ - 5953, 5954, 7559)

               ఇబ్ను అబ్బాస్ (రజి) ఉల్లేఖన ప్రకారం ప్రవక్త (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ) ఇలా సెలవిచ్చారు: "ప్రతి ఫోటో గ్రాఫర్, చిత్రకారుడిని నరకానికి పంపబడుతాడు. అతను చిత్రీకరించిన ప్రతి ఫోటో, చిత్రంలో ప్రాణము పోసి, ఒక రూపము ఇవ్వబడును. అది నరకంలో అతన్ని శిక్షించును." (మళ్ళీ ఇబ్ను అబ్బాస్ (రజి) చెప్పారు: "ఒకవేళ నీవు ఫోటో గ్రాఫిక్ చేయాలనుకుంటే, చిత్రించాలనుకుంటే చెట్లు మరియు ప్రాణం లేని వాటిని చిత్రించు." (ఇబ్నెహిబ్బాన్ - 7173, ముస్లిం - 2110)

                 మానవులు, పశువులు మొదలైన ప్రాణము గలదాన్ని చిత్రించుట నిషిద్ధం అని పై హదీసుల ద్వారా స్పష్టమవుతుంది. అది ప్రింటింగ్ ద్వారా, చేతుల నైపుణ్యంతో, ఏ దాని పైనైనా చెక్కి వేసినా, చిత్రలేఖనం ద్వారా, కత్తిరింపులు చేసినా, అచ్చుల ద్వారా, ఏ విధంగా చిత్రించినా అది నిషిద్ధమే.

                ముస్లిం విశ్వాసుడు ఎల్లప్పుడు ధర్మం ఆదేశం వచ్చిన వెంటనే శిరసా వహించాలి. వ్యతిరేకించవద్దు. 'నేను దాన్ని పూజించడము లేదు, సాష్టాంగపడుట లేదు' అన్న సాకులు చెప్పవద్దు.

                   ఈ కాలంలో ఫోటోల వలన వ్యాపిస్తున్న కేవలం ఒక్క చెడును బుద్ధి పూర్వకంగా, దూరదృష్టితో గ్రహిస్తే, ఇస్లాం దీన్ని నిషిద్ధ పరచినందుకు ఎన్ని లాభాలున్నాయో స్వయంగా తెలుసుకుంటాడు. కామోద్రేకం నుండి మొదలుకొని వ్యభిచారంలో వరకు పడవేసే ముఖ్య సాధనము ఫోటోలు అందుకే ఏ విశ్వాసుడు ప్రాణంగల ఫోటో తన ఇంట్లో ఉంచకూడదు. అవి ఫోటోలు దైవదూతలను మన ఇంట్లో ప్రవేశానికి ఆటంకము కలుగజేస్తాయి. ప్రవక్త (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు : “ఏ ఇంట్లో కుక్కా మరియు ఫోటోలు, చిత్రాలు ఉంటాయో ఆ ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు." (బుఖారీ - 3225, ముస్లిం - 2106)

                 కొన్ని ముస్లిం ఇళ్ళలో విగ్రహాలు, అవిశ్వాసులు దేవి దేవతలుగా భావించేవారి ఫోటోలు కూడా ఉంటాయి. ఇవి అలంకరణ కొరకు పెట్టాము, లేక బహుమానంగా వచ్చినవి. అందుకని భద్రపరిచాము అని అంటారు. కాని వీటి నిషిద్ధత మరీ కఠినంగా ఉంది. ఒక వేళ అవి తగిలించి, వ్రేలాడి ఉంటే, వాటి నిషిద్ధత తగిలించి లేనివాటి కంటే ఎక్కువ ఉంటుంది. ఇలా వాటిని భద్రపరచడము, తగిలించడము వల్లనే వాటిని పూజించడము జరుగుతుంది. వాటిని చూసి తమ దుఃఖాలు దూరం అవుతాయని భావించబడుతుంది. దీనివలన ఎందరో తమ తాత ముత్తాతల పై బూటకపు గర్వంలో పడి, బడాయీలు కొడుతున్నారు. ఇవి జ్ఞాపకార్థం కొరకు అని అనరాదు. ఎందుకనగా తమ ముస్లిం సోదరుల, బంధుమిత్రుల వాస్తవ జ్ఞాపకార్ధము మనసులో ఉంటుంది. అది ఏమనగా వారిపై అల్లాహ్ యొక్క దయ, కరుణ క్షమాపణ కురవాలని దువా చేయుట.

                 అందుకే అన్ని ఫోటో, చిత్రాలను తీసేయాలి, చరిపేయాలి. దేన్ని అయితే తీయడము, చేరిపేయడంలో తీవ్ర కష్టమో దాన్ని అల్లాహ్ పై వదలాలి. ఉదాహరణకు : వివిధ డబ్బాలపై, నోట్లపై, డిక్షనరీల్లో, కొన్ని పుస్తకాల్లో ఉండేటివి. తమ శక్తి మేర ప్రయత్నించాలి. ప్రత్యేకించి అశ్లీల చిత్రాలను చెరిపేయాలి. కానీ పాస్పోర్ట్, ఐడెంటి కార్డు లాంటి తీవ్ర అవసరాలకు ఫోటోలను ఉపయోగించవచ్చును. కొందరు ధర్మవేత్తలు, పండితులు కాళ్ళ క్రింద వచ్చే (దిండ్లపై, పడగలపై ఉండే) చిత్రాలను చెరపకున్ని పరవాలేదు అని చెప్పారు. (ఎందుకనగా వాటిని గౌరవించడం జరుగదు). కానీ కొందరు ధర్మ వేత్తలు ఇవి కూడా నిషిద్ధమని తెలియజేశారు.

                 ఖుర్ఆన్‌లో అల్లాహ్ (సు.త) ఇలా తెలియజేశాడు :

                 "అయినా మీకు మీరు సాధ్యమైనంతవరకు అల్లాహ్‌తో భయపడుతూ ఉండండి." (ఖుర్ఆన్ - సూరయె త'గాబున్ (64) : 16)

No comments:

Post a Comment