Hellobar

Thursday, December 23, 2021

🌷ఒకరి మాటను రహస్యంగా వినుట, అది వారికి తెలిస్తే ఇష్టపడరని తెల్సికూడా వినడం🌷

        అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను


🌷ఒకరి మాటను రహస్యంగా వినుట, అది వారికి తెలిస్తే ఇష్టపడరని తెల్సికూడా వినడం🌷



              అల్లాహ్ ఆదేశం: "ప్రజల రహస్యాలను దేవులాడకండి." (ఖుర్ఆన్ - హుజురాత్ (49) : 12)


                     ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు:

                    "ఎవరు ఇతరుల మాటలను గుప్తంగా వింటాడో, అది వారికి ఇష్టం లేకున్నా, అతని చెవిలో సీసం కరిగించి పోయబడును." (తిబ్రాని ఫల్ కబీర్: 11/248)


                   ఒకవేళ అతడు గుప్తంగా విన్న మాటల్ని వారికి తెలియకుండా ఇతరులకు చెప్పితే, రహస్యంగా విని సంపాదించిన పాపమే గాక, చాడీలు చెప్పేవారి పాపంలో కూడా పడుతాడు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు:

                  “చాడీలు చెప్పేవాడు స్వర్గంలో చేరడు." (సహీహుల్ జామె 6994, బుఖారీ 7042)

No comments:

Post a Comment