Hellobar

Tuesday, December 21, 2021

🌷 సమాధిపై కూర్చుండుట, దానిపై నడుచుట మరియు స్మశానాన్ని మరుగుదొడ్డిగా ఉపయోగించుట🌷

 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను

                

🌷 సమాధిపై కూర్చుండుట 🌷

🌷దానిపై నడుచుట మరియు స్మశానాన్ని మరుగుదొడ్డిగా ఉపయోగించుట🌷


                 హజ్రత్ అబూ హురైరా (రజి) కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు:

                "మీలో ఒక వ్యక్తి నిప్పులపై కూర్చొని, ఆ నిప్పులు అతని బట్టలను కాల్చి దాని శెగ శరీరానికి కల్గినప్పటికినీ అది సమాధిపై కూర్చునేదానికంటే మేలు." (ఇబ్నెమాజా 1566, ముస్లిం 971)


                 కొందరు శవాన్ని ఖననం చేయడానికి వెళ్ళినప్పుడు సమాధులపై నడుస్తారు. ఒక్కోసారి చెప్పులతో వాటిని తొక్కుకుంటూ వెళ్తారు. ముస్లిం శవం యొక్క గౌరవాన్ని కొంచెం కూడా పట్టించుకోరు. ఇది పెద్ద పాపం అని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) భయభీతుల్ని చేశారు:

                  "నిప్పులపై లేక ఖడ్గం యొక్క చురుకుదనంపై నడుచుట, లేక నా చెప్పును పాదంతో సహా కట్టుకొనుట ఒక ముస్లిం సమాధిపై నడుచుటకంటే ఇష్టం." (ఇబ్నెమాజా 1567, సహీహుల్ జామె 5038)


                   ప్రతి బుద్ధిమంతుడు ఆలోచించదగ్గ విషయం! సమాధులపై కూర్చుండుట, నడుచుట ఇంత పెద్ద పాపమైనప్పుడు, స్మశాన భూమిని ఆక్రమించుకొని, దానిపై కమర్షియల్ లేక రెసిడెన్షియల్ స్కీంల ప్లాన్లు వేయుట ఎంత ఘోరమైన పాపం. మరి కొందరు దురదృష్ట వంతులు స్మశాన గోడలు (ఉంటే) దాటి తమ కాలకృత్యాలు తీర్చుకుంటారు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

                  "కాలకృత్యాలు స్మశానంలో తీర్చుకొనుట, లేక నడిబజారులో తీర్చుకొనుట రెండూ సమానమే." (ఇబ్నెమాజా 1567 అబూదావూద్, తిర్మిజీ, నసాయి, సహీహుల్ జామె 5038)


                   దీని అర్ధమేమిటంటే నడి బజారులో తమ మర్మాంగాన్ని తెరచి, అవసరం తీర్చుకొనుట ఎంత అశ్లీలమో, చెడో, స్మశానంలో చేయుట కూడా అంతే అశ్లీలం, చెడు. అదే విధంగా స్మశానంలో చెత్త చెదారం వేయువారు కూడా. (ప్రత్యేకంగా ప్రహారి గోడలు లేని స్మశానంలో) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇచ్చిన పై హెచ్చరికల పరిధిలోకే వస్తారు.

No comments:

Post a Comment