“సహ్‌రీ' అంటే ఉపవాసం
పాటించే ఉద్దేశ్యంతో తెల్లవారుజామున భోజనం చేయడం అని ఆర్థం. సహ్‌రీ వేళ
మించిపోయిందని అసలేమీ తినకుండా రోజా పాటించడం మంచిది కాదు. సహ్‌రీ తినకుండా ఉపవాసం
ఉండటం వల్ల మధ్యాహ్నం కల్లా మనిషి నీరసించిపోతాడు.సూర్యాస్తమయం వరకు ఆసక్తి,
ఉత్సాహాలతో ఉపవాసం పాటించలేడు.
“సహ్‌రీ (భోజనం) చేయండి. సహ్‌రీ చేయడంలో
శుభం ఉంది” అన్నారు మహాప్రవక్త ముహమ్మద్ (న)- (బుఖారి,
ముస్లిం)
“సహ్‌రీ భోజనంలో ఎంతో శుభం ఉంది. కనుక నహ్‌రీ
చేయడం ఎన్నటికీ వదలి పెట్టకండి. గుక్కెడు నీళ్ళతోనవైనా సరే సహ్‌ర్ చేయండి. సహ్‌ర్
ఆహారం తినే వారిపై దైవకారుణ్యం వర్షిన్తుంది, వారి కోనం
దైవదూతలు పాపమన్నింపు ప్రార్ధన చేస్తారు” అన్నారు దైవప్రవక్త
(సల్లం) మరొక సందర్భంలో. (అత్తర్గబ్)
దైవప్రవక్త (సల్లం) తమ అనుచరులతో మాట్లాడుతూ
"మీలో ఎవరైనా అజాన్ విన్నప్పుడు అతని ముందు కంచంలో అన్నం ఇంకా
"మెగిలివుంటే, అతనా " అన్నం తినే దాకా
కంచం వదలి లేవకూడదు” అని అన్నారు. (అబూదావూద్)
హజ్రత్ అయిషా (రజి) కథనం: "(రమజాన్
నెలలో) బిలాల్ (రజి) (అర్థ)రాత్రివేళ ఇంకా ఉండగానే అజాన్ ఇస్తుంటారు. అందువల్ల
మీరు (ఆయన అజాన్ గురించి పట్టించుకోకుండా) ఇబ్నె ఉమ్మెమఖ్లూమ్ (రజి) తిరిగి
అజాన్ ఇచ్చే వరకు నిరభ్యంతరంగా (సహ్‌రీ) తినవచ్చు, తాగవచ్చు.”
(బుఖారి, మున్లిం)
అంతేకాదు "మూడు విషయాలు ప్రవక్తల
లక్షణాల్లాంటిఎ. అవి: 1- నహ్‌రీ అలస్యంగా తినడం, 2-
ఇఫ్తార్ తొందరగా చేయడం, 3- నమాజ్‌లో ఎడమ చేతిపై కుడిచేయి
పెట్టుకోవడం” అని కూడా దైవప్రవక్త (స) తెలిపారు. (ఆసాన్‌ఫిఖ్కా)
“మీరు (ఉపవాసకాలంలో) కడరేయి నలుపు (చీకటి)
తగ్గి తొలిజాము తెలుపు (ఉషోదయ కాంతి) కనపడేవరకు హాయిగా తినండి, త్రాగండి. ఆతర్వాత (వీటన్నిటినీ త్యజించి)
సూర్యాస్తమయమై చీకటిపడేవరకు ఉపవాసం
పాటించాలి.” (ఖుర్‌ఆన్-2;: 187)
హజత్ అద్దీ బిన్‌హాతిం (రజి) పైసూక్తి
విషయంలో తన అనుభవాన్ని ఇలా తెలియచేశారు: "నడిరేయి నలుపు తగ్గి తొలిజాము
తెలుపు కనబడేవరకు' (2:187) అనే సూక్తి అవతరించినప్పుడు
నేను ఒక నల్లదారం, ఒక తెల్లదారం తీసుకొని తలగడ క్రింద పెట్టు
కున్నాను. కాని రాత్రి చీకటిలో చూశ్లే స్తే
అవ నాకు "కనించలేదు. ఉదయం కాగానే నేను దైవప్రవక్త (స) సన్నధికి వెళ్ళి విషయం
తెలిపాను. దైవప్రవక్త (సు అది ఎని వాటి అర్థం
రాత్రి నలుపు, పగటి
తెలుపు అని గగ్రహించాలి' అని అన్నారు.” (బుఖారి)
సాల సహాల్ బిన్ సాద్ (రజి) కథనం: “"వకులూ వష్రబూ హత్తాయత బయ్యన లకుముల్ ఖైతుల్ అబ్‌యజుమినల్ కైతిల్
అన్వది' అనే సూక్తి (2:187) అవతరించింది.మినల్ ఫజ్ర్ ఇంకా అవతరించలేదు. అప్పుడు
(మాలో) కొందరు ఉపవాసం ఉండేందుకు (సహ్‌రీ వేళ తెలుసుకోవడానికి) తమ కాళ్ళకు ఒక
నల్లదారం, ఒక తెల్లదారం కట్టుకొని అ దారాలు స్పష్టంగా
కన్చించేవరకు (రాత్రివేళ నిస్సంకోచంగా) తింటూవుండేవారు. తరువాత దేవుడు 'మినల్ ఫథజ్ సూక్తి అవతరింపటేశాడు. దాంతో వారికి ఈ సూక్తి అర్థం
పగలు-రేయి అని కెలిసింది. ' (బుఖారి, ముస్లిం)
దైవప్రవక్త (సల్లం) ఒకసారి ఇలా అన్నారు: “మన ఉపవాసాలకు, గ్రంథప్రజల (యూదులు, క్రైస్తవుల) ఉపవాసాలకు తేడా సహ్‌రీ భోజనమే.” (ముస్లిం)
ఒకసారి ముగ్గురు సహావీలు ప్రవక్త సతీమణి
హజ్రత్ ఆయిషా (రజి) ద్వారా దైవప్రవక్త (సల్లం) అరాధనలను గురించి విన్న తరువాత
వారిలో ఒకతను తౌనిక నుంచి ఎల్లప్పుడూ రాత్రంతా నమాజులో గడువుతానని
నిశ్చయించుకున్నాడు.మరొకతను తాను ఎల్లప్పుడూ ఉపవాసవ్రతం వాటిన్హానని, ఒక్కరోజు కూడా విడిచిపెట్టనని అన్నాడు. వేరొకడు తానసలు వవాహమే చేసుకోనని,
ప్రీలతో ఎలాంటి సంబంధం 'పట్టుకోనని
నిర్ణయించుకున్నాడు.
దైవప్రవక్త (సల్లం) ఈ సంగతి తెలుసుకొని “మీరేనా ఈ మాటలు అంటున్నది? దైవసాక్షి! నేను మీ
అందరిలో కెల్లా దేవునికి ఎక్కువగా భయపడేవాడి. అయినా నేను కొన్నాళ్ళు ఉపవాసం ఉంటే,
కొన్నాళ్ళు ఉపవాసం లేకుండా గడుపుతున్నాను. రాత్రి వేళల్లో ప్రార్థన
కూడా చేస్తాను, నిద్ర కూడా పొతాను. అలాగే స్రీలను ఎవాహమాడి దాంపత్య
జీవతం కూడా గడుపుతాను. కనుక నాసంప్రదాయాలు పాటించనివారితో నోకెలాంటి సంబంధం లేదు”
అని హెచ్చరించారు. (బుఖారి, ముస్లిం)
'సహ్‌రీ అంటే రోజూతినే ఆహారంమే కదా!
కాకపోతే ఈ ఆహారం ఉషోదయానికి ముందు తినాలి, అంతేగా!” అనుకుంటారు కొందరు. కాని ఇదెంతో శుభవంతమైన ఆహారం.
హజత్ ఇర్చాజ్ బెన్ సారియా (రజి) కథనం:
"ఒక సారి దైవప్రవక్త (సల్లం) తనతో పాటు నహ్‌రీ చేయడానికి నన్ను పెలుస్తూ 'శుభవంతమైన (నహ్‌ర) భోజనం చేయడానికి వచ్చెయ్యి" అన్నారు.” (అబూదావూద్, నసాయి)
“విశ్వాసికి ఖర్జూరపండ్లు అత్యంత
శ్రేష్టమైన సహ్‌ర (ఆహారం).” (అబూదావూద్)
ఖర్జూర పండ్లలో మానవుని ఆహారపు అవసరాలన్నీ
సమకూర్చే సామర్థ్యం ఉంది. మనిషికిఖర్జూర పండ్లు తప్ప మరే ఆహార పదార్థాలు
లభించకపోతే ఆ పండ్లే అతనికి చాలు. వాటిలోనే కావలసిన పోషక పదార్థాలన్నీ ఉన్నాయి.
సైంటిస్టుల పరిశోధన ప్రకారం మానవునికి తన
శక్తిసామర్థ్యాలు కాపాడుకోవడానికి ఎన్ని కేలరీల ఆహారం కావాలో అన్ని కేలరీలు
ఖర్జూరపండ్లలో ఉన్నాయి. అందుకే ఈనాడు సైనికులు ఎడారి ప్రాంతంలో సుదీర్హకాలం
ఉండవలసి వచ్చినప్పుడు సాధారణ ఆహారపదార్థాల సరఫరాకు సత్వర అవకాశాలులేని పక్షంలో
వారికి ఖర్జూర పండ్లు సరఫరా చేయడం జరుగుతోంది.ఇలా నెలల తరబడి కేవలం ఖర్జూర పండ్లతో
గడిపినా వారి శక్తి ఎమాత్రం సన్నగిల్లదు.
ఉపవాసవ్రతం కోసం సంకల్పం ఎంతో ఆవసరం. ఈ రోజు
నేను రమజాన్ ఉపవాసం పాటిస్తున్నానని సంకల్పించుకొని వేకువజాము
నుంచి ఉపవాసవ్రతం ప్రారంభించాలి.
దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు: “ఎవరైనా ఫజర్ వేళకు ముందే ఉపవాసం ఉంటానని నిర్ణయించుకోకపొతే అతని ఉపవాసం
ఉపవాసం కాజాలదు.” (తిర్మిజి)
No comments:
Post a Comment