Hellobar

Saturday, June 22, 2019

Lailatul Khadr - లైలతుల్‌ఖద్‌ (మహాశుభరాత్రి)

లైలతుల్‌ఖద్‌ (మహాశుభరాత్రి)


యావత్‌ మానవ చరిత్రలోనే కనివిని ఎరుగని ఓ అద్భుత నంఘటన సంభవించింది. ఆ సంఘటన మానవుల చరిత్రగతిని సమూలంగా మార్చి, ఓ నూతన ప్రపంచ ఆవిష్కరణకు నాందిదీవాచకం పలికింది. అది మానవుని సకల జీవన రంగాల్లోనూ అణువణువునా మానవత్వాన్ని నూరిపోసి అతడిని అత్యున్నత నైతికశిఖరాల పైకి చేర్చింది. ఈ సంఘటన సంభవించిన శుభసమయం ఒక రాత్రిలో కొన్ని ఘడియలు మాత్రమే అయినప్పటికి ఆ రాత్రి అంతా శుభప్రదమైన రాత్రే. అంతేకాదు ఆ రాత్రి వచ్చే నెల కూడా శుభప్రదమైనదిగానే పరిగణించబడింది.ఆ నెలే వరాల వసంతమైన రమజాన్‌ మానం.

రమజాన్‌ నెలలోని అ శుభరాత్రినే ఖుర్‌ఆన్‌ లైలతుల్‌ ఖద్ర్‌అని పేర్కొన్నది.

మేము దీన్ని ఘనతగల రాత్రిన అవతరింపజేశాం. ఘనతగల ఆరాత్రి ఏమిటో నీకేం తెలుసు? ఆ మహారాత్రి వేయినెలలకన్నా ఎంతో (శ్రేష్టమైనది. ఆ రాత్రి పరిశుద్ధాత్మ దైవదూతలు తమ ప్రభువు అనుమతితో వ్రతివ్యవహారానికి సంబంధించిన ఆజ్జలు తీసుకొని అవతరిస్తారు. అది ఉషోదయం వరకు శుభవంతమైన రాత్రి.” (ఖురిఆన్‌-97:1-5)

“ఖద్ర్ర్” అంటే ఎంతో విలువైన, ఘనమైన, గౌరవప్రదమైన  అని అనేక అర్థాలు ఉన్నాయి. లైలతుల్‌ఖద్ర్‌ అంటే ఎంతో విలువైన, ఘనమైన, గౌరవప్రదమైన రాత్రి అని భావం. దుఖాన్‌ సూరాలో ఖుర్‌ఆన్‌ ఓ శుభరాత్రి అవతరించిందని ఉంది. అంటే ఈ రాత్రిని గొప్ప శుభాల నిలయంగా పేర్కొనవచ్చు. ఈ వరాల వసంతాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి దైవవ్రవక్త(స) షాబాన్ నెల నుంచే తేదీలు లెక్కపెడ్తూ రమజాన్‌ నెలారంభ నమయం కోసం ఎదురుచూసేవారు. దీన్ని గురించి అనుచరులకు కూడా తాకీదు చేస్తూ రమజాన్‌ తేదీలు తెలుసుకోవడానికి వీలుగా షాబాన్‌ నెలవంక లెక్కగడ్తూ ఉండండని సెలవిచ్చారు.

దైవప్రవక్త (స) షాబాన్‌ నెల చివరి రోజుల్లో ఓసారి ఇలా బోధించారు: ప్రజలారా! మీ కోసం ఒక మహోజ్వలమైన, ఎనలేని శుభాల నెల రాబోతున్నది. అందులోని ఒక రేయి వేయి నెలలకన్నా శ్రేష్టమైనది. దేవుడు ఈ నెలలో ఉపవాసాల పాటింపు విశ్వాసులకు వ్యక్తిగత విధి (ఫర్జెఅయిన్‌)గా నిర్ణయించాడు.” (బైహఖీ)

దైవప్రవక్త (స) ప్రవచనం: మీకు ఈ నెల వచ్చింది. ఇందులో ఒక రాత్రి వేయి నెలల కంటే కూడా శ్రేష్టమైనది. దీనికి నోచుకోనివాడు యావత్తు శ్రేయోశుభాలకు దూరమైపోతాడు. పరమదౌర్భాగ్యుడే దాని శ్రేయోశుభాలకు దూరమైపోతాడు.” (ఇబ్నెమాజ)

అంచేత రమజాన్‌ రోజాలను నిరాకరించినవాడు అవిశ్వాసి అవుతాడని, షరీఅత్‌ కారణం లేకుండా విటిని వదలినవాడు పాపాత్ముడిగా పరిగణించబడతాడని ఫిఖ్కావేత్తలు నిర్థారించారు.

దైవప్రవక్త (స) ప్రవచనం: లైలతుల్‌ఖద్ర్ రాగానే హజ్రత్‌ జిబ్రీల్‌ (ఆలై) ఓపెద్ద దైవదూతల బృందంతో భూలోకానికి వస్తారు. అప్పుడు నిల్చొని, కూర్చొని మహోన్నతుడైన దేవుడ్ని స్మరించే ప్రతి దైవదాసుడి కోసం అయన దుఆ చేస్తారు. పండుగరోజు వచ్చాక దేవుడు తన దాసుల పట్ల దైవదూతల ముందు గర్విస్తాడు. "దైవదూతలారా! తనకు అప్పగించిన పనిని నెరవేర్చిన కార్మికుడికి ప్రతిఫలం ఏమిటని వారిని ప్రల్నిస్తాడు. దానికి దైవదూతలు కార్మికుడికి అతని వేతనం పూర్తిగా ఇచ్చేయాలిఅని అంటారు.

అప్పుడు దేవుడు ఇలా ఆంటాడు: దైవదూతలారా! నేను నా దాసులకు, దాసీలకు అప్పగించిన బాధ్యతను వారు నెరవేర్చారు. ఇప్పుడు వీరు నన్ను దీనాతిదీనంగా వేడుకోవడానికి ఇండ్ల నుంచి (ఈద్‌నమాజ్‌ కోసం) బయలు దేరారు. (వినండి!) నా గౌరవప్రతిష్టల సాక్షిగా, నారౌద్రత సాక్షిగా, నాదాక్షిణ్యం సాక్షిగా, నామహోన్నత హోదా-ఆంతస్తుల సాక్షిగా, నా అత్యున్నత స్థాయి సాక్షిగా, చెబుతున్నాను- నేను వీరి వేడుకోళ్ళను తప్పకుండా స్వీకరిస్తాను.ఆ తర్వాత అల్లాహ్ తన దాసుల్ని ఉద్దేశించి “(నా దాసులారా!) నేను మిమ్మల్ని క్షమించాను. మీ పాపాలను పుణ్యాలుగా మార్చేశాను, వెళ్ళండిఆంటాడు-దైవప్రవక్త (స) ఈ విషయాలు చెబుతూ "అప్పుడు వారు దేవుడు తమను క్షమించిన స్థితిలో తమ (ఇండ్లకు) మరలిపోతారుఅని అన్నారు. (బైహఖీ)

ఒకసారి హజ్రత్‌ అయిషా (రజి) దైవప్రవక్తా! నాకే గనక లైలతుల్‌ఖద్ర్ దర్శించే భాగ్యం లభిస్తే దైవాన్ని నేనేం వేడుకోను? ' అనడిగారు. దానికి దైవప్రవక్త (స) అల్లాహుమ్మ ఇన్నక అపువ్వున్‌ తుహిబ్బుల్‌ అఫ్వా ఫాఫు అన్నీ” (దేవా! నీవు అమితంగా క్షమించేవాడివి. క్షమాభిక్ష అంటే నీకెంతో ఇష్టం. కనుక నన్ను క్షమించు) అని వేడుకో అన్నారు. (మిష్కాత్‌)

మహారాత్రిన మన పాపాల మన్నింవు కోనం దైవాన్ని వేడుకోవడం నఫిల్‌ నమాజ్‌ చేయడం కన్నా ఉత్తమంఅని ఇమామ్‌ సుఫియాన్‌ సౌరీ (రహ్మలై) అన్నారు.

దివ్యఖుర్‌ఆన్ లోని ఖద్ర్‌' నూరాలో దైవదూతలు, జిబ్రయీల్‌ (ఆలైహ) ఈ రాత్రి తమ ప్రభువాజ్ఞతో అన్ని రకాల ఉత్తర్వులను, ఆదేశాలను తీసుకాని అవతరిస్తారనిఉంది. దుఖాన్‌ సూరాలో ఈ రాత్రిని దైవాజ్ఞతో అన్ని వ్యవహారాలకు నంబంధించిన తిరుగులేని గట్టి నిర్ణయాలు జారీ చేయబడే రాత్రి అని పేర్కొనడం జరిగింది.
హజ్రత్ ఆయిషా (రజి) ప్రకారం 'లైలతుల్‌ఖద్ర్‌'ని రమజాన్‌ నెల చివరి పది రాత్రుల్లోని బేసి రాత్రుల్లో అన్వేషించమని దైవప్రవక్త (స) చెప్పారు. (బుఖారి, ముస్లిం)

దైవప్రవక్త (స) ప్రవచనం: లైలతుల్‌ ఇదని రమజాన్‌ నెల చివరి దశకంలో అన్వేషించండి. అంటే 21 23, 25, 27, 29 తేదీలలో అన్వేషించండి.” (బుఖారి)

దైవప్రవక్త (స) అనుచరులు అనేక మంది రమజాన్‌ నెల చివరి ఏడు తేదీలలో లైలతుల్‌ఖద్ర్‌ ఉన్నట్లు కల గాంచారు. ఈ వార్త దైవప్రవక్త (స) దృష్టికి రాగా ఆయన ఇలా అన్నారు: మారు కలలో రమజాన్ నెల చివరి ఏడురోజుల విషయంలో ఏకాభి'ప్రాయానికి వచ్చినట్లు కన్పిస్తున్నారు. కనుక ఇక నుంచి లైలతుల్‌ఖద్ర్ అన్వేషించే మనిషి రమజాన్‌ నెల చివరి ఏడు తేదీలలో అన్వేషించాలి. (ముత్తఫఖున్‌ అలై)
లైలతుల్‌ఖద్ర్ కు సంబంధించిన జ్ఞానాన్ని దేవుడు వాపసు తీసుకున్నప్పుడు దైవప్రవక్త(స) తమ అనుచరులతో బహుశా అందులోనే మా శ్రేయస్సు ఉంది కనుక మీరిప్పుడు దాన్ని 21వ లేదా 23వ లేదా 25వ లేదీ రాత్రి వెతకండిఅని సెలవిచ్చారు. (బుఖారి)

హజ్రత్ అబూహురైరా (రజి) ఉల్లేఖించారు: 27వ రాత్రి లేక 29వ రాత్రి అని ఈ మహారాత్రిని గురించి దైవప్రవక్త (స) అన్నారు.” (అబూదావూద్‌)

హజ్రత్ అబూజర్‌ (రజి)ను ఈ రాత్రిని గురించి అడిగితే ఆయన, హజ్రత్‌ ఉమర్‌(రజి), హజ్రత్‌ హుబైఫా (రజి), ఇంకా ఇతర సహాబీలలో ఏ ఒక్కరికీ అ రాత్రి 27వ రాత్రి అనే విషయలో అనుమానంలేకుండేదని అన్నారు. (ఇబ్నె అచిపైబా)

షబేఖద్ర్‌ గురించి సహాబీల అభిప్రాయాలు ఎలా ఉన్నా దేవుడు అది ఫలానా రాత్రి అని మాత్రం నిక్కచ్చిగా చెప్పలేదని తెలుస్తొంది. దీనిక్కారణం ప్రజలు ఏదో ఒక రాత్రితో తృప్తి పడకుండా ఆ మహారాత్రి శుభాలతో ప్రయోజనం పొందాలనే ఆసక్తితో వీలైనన్ని ఎక్కువ రాత్రులు దైవారాధనలో గడుపుతారని కావచ్చు.

దైవప్రవక్త (స) ప్రవచనం: ఎవరు (దృఢమైన) విశ్వాసంతో, ఆత్మపరిశీలన (స్పృహ)తో రమజాన్‌ ఉపవాసాలు పాటిస్తాడో, అతని గత పాపాలన్నీ క్షమించబడతాయి. అలాగే మరెవరు (దృఢమైన) విశ్వానంతో, ఆత్మపరిశీలన (స్పృహ)తో రమజాన్‌ నెలలో రాత్రి జాగరణ (అంటే తరావీ నమాజ్‌) చేస్తాడో, అతని గత పాపాలు కూడా క్షమించబడతాయి. అలాగే ఎవరు మహాశుభరాత్రిన శ్వాస స్ఫూర్తితో, ఆత్మపరిశీలన స్పృహతో రాత్రి జాగరణ చేస్తాడో అతని గత పాపాలు కూడా క్షమించబడతాయి.” (బుఖారి, ముస్లిం)

No comments:

Post a Comment