Hellobar

Wednesday, October 20, 2021

అరచేతిలో అశ్లీలం - ఆడబిడ్డల పాలిట శాపం

అరచేతిలో అశ్లీలం - ఆడబిడ్డల పాలిట శాపం  

                                                                                         ....✍️ శాంతిజ్యోతి, ఎమ్మిగనూరుబిడ్డ

తల్లిపక్కన నిద్రిస్తున్న ఆరునెలల పసికందును, ఆడుకునే ఆరు సం"ల పసిపాపను, బడికి వెళ్లే పన్నెండేళ్ల అమ్మాయిని, పాతికేళ్ల అమ్మను, అరవై సం"ల బామ్మను, దివ్యoగురాల్లను, మానసిక రోగులను కూడా వదలకుండా బరితెగించి పోతున్నారు మృగాళ్లు. 

                చివరకు స్త్రీ శవాలను కూడా వదిలేలా లేరు. ఇంతటి విపరీత ప్రవర్తనకు కారణం ఏమిటని అన్వేషిస్తే....కళ్లెదుటే కనిపిస్తుంది. ఆదే ఆదే స్మార్ట్ ఫోన్.ఈ స్మార్ ఫోన్ లలో నీలిచిత్రాలను చూడటం అలవాటుగా మారి వ్యసనానికి దారితీస్తుంది. ఈ వ్యసనమే స్త్రీలపై హత్యాచారాలకు కారణమవుతుంది. 

            వ్యసనం మనిషిని బానిసగా మారుస్తోంది. మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలలాగే నీలిచిత్రాలను చూడటం కూడా ఒక రుగ్మతగా మారుతుంది.   దీని దుష్పరిణామాలు వ్యక్తిగతంగాను, సమాజంపై తీవ్రంగా ఉంటున్నాయి.

        చాలా మందిలో ముఖ్యoగా బాలలు, యువకుల్లో అలవాటుగా మొదలై క్రమంగా వ్యసనంగా మారుతుంది.నేరాలకు పురికొలుతుంది.   ఇలాంటి వారు వావి వరుసలే కాదు, వయస్సు, తారతమ్యాలు, లింగభేదం లేకుండా ప్రవర్తిస్తుంటారు.

       గతంలో ఈ అశ్లీలం వీడియో క్యాసెట్లు, సీడిలా రూపంలో రహస్యంగా ఉండేది.  మారిన సాంకేతిక విప్లవంతో ఇప్పుడు స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు.... వేగవంతమైన ఇంటర్నెట్ వెరసి, వేలికొన తాకగానే అశ్లీలత వరదలా ముంచుతుంది. అధికశాతం లైంగిక నేరాల వెనుక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీటి ప్రభావం ఉంటుంది.

   చౌకధరల స్మార్ట్ ఫోన్లు,  స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో, కుప్పలు తెప్పలుగా ఉన్న పోర్నోగ్రపి సైట్లను ఎక్కడినుంచైనా సులభంగా చూసే వెసులుబాటు వచ్చేసింది. 

  90%మంది నీలిచిత్రాలను మొబైల్ ఫోన్లలోనే చూస్తున్నారని,  వీటిని చూసేవారిలో ప్రపంచంలోనే భారతీయులు 2వ స్థానంలో ఉన్నారని ఒక సర్వేలో తేలింది. పదేపదే వీటిని చూసి చూసి, ఉత్తేజితులై ఏదోఒకరోజు ప్రాక్టికల్ లోకి వెళ్లాలనిపిస్తుంది.  ఆ ప్రయత్నంలొనే ఈ హత్యాచారాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ రోగానికి మూలం మొదట ఇంటర్నెట్ లో అశ్లీలాన్నీ నిషేధించాలి. లేదా కనీసం మన దేశంలో నైనా వీటిని బ్లాక్ చేయాలి.  పిల్లలకు ఫోన్లు కొనిచ్చేటప్పుడే వీటి గురించి అవగాహన కలిగించాలి.  

అశ్లీలాన్ని చూసేవారిలో విపరీత లక్షణాలు
🏀   నీలిచిత్రాలను చూసి చూసి వాటికి బానిసలుగా మారినవారిలో విపరీతమైన లైంగిక ప్రవర్తనలు ఉంటాయి.
🏀   చిన్నారుల్ని, స్త్రీలను తమ కోరీకలను తీర్చే లైంగిక వస్తువులుగా ఆలోచనలు పెరిగి, హత్యాచారాలకు దారితీస్తాయి.
🏀   సామాజిక కార్యకలాపాలకు క్రమంగా దూరమైపోతారు. రహస్య చాటుమాటు జీవితానికి అలవాటుపడతారు.
🍥   అబద్ధాలు చెప్పడం, మోసం చేసే ధోరణి పెరుగుతుంది
🍩  కోపానికి, కుంగుబాటుకు గురవుతుంటారు.
🍥  మాధకద్రవ్యాలకూ అలవాటు పడొచ్చు.
🍩 నేరాల బాట పెట్టె ప్రమాదం ఉంది.

   అశ్లీల చిత్రాలు చూసే అలవాటు మొదట్లో సరదాగా ప్రారంభమవుతుంది. రోజులు గడిచేకొద్దీ కొత్తదనం కోసం మనసు ఉసిగొలుపుతుంది.

        అంతిమంగా యిది వారిలో విపరీత ప్రవర్తనకు దారితీస్తుంది.  వావి వరుసలు లేకుండా, వయసు భేదం లేకుండా చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడటం. పెళ్లయిన వారైతే భాగస్వాములను హింసించడం ద్వారా ఆనందం పొందడం వంటివి చేస్తుంటారు. కాబట్టి దీన్ని ఆదిలోనే తుంచేయాలి.

          ఏ వయసు వారైనా ఫోర్న్ సైట్స్ జోలికే వెళ్లరాదు. వీటికి బానిసలుగా మారిన వారు తమ లక్ష్యాలను సాధించలేరు. తామనుకున్నా గమ్యాన్ని చేరలేరు. తమ శక్తిసామర్ధ్యాలనూ కోల్పోతారు. ఏకాగ్రత, శ్రద్ధ, పట్టుదల, శ్రమించేగుణం లోపించి సోమరులుగా మారుతారు. కాబట్టే

"Empty mind is Devil's Workshop"

     మైండ్ ఖాళీ లేకుండా ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉండాలి. లేదా ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తుండాలి. లేదా మన జ్ఞానాన్ని ఇతరులకు భోధించాలి.

      అశ్లీల విషయాలు బహిరంగమైనా, రహస్యమైనా మీరు వాటికి దూరంగా ఉండాలని దేవుడు ఖురాన్ లో ఆదేశించాడు.

ఆడబిడ్డలపై హత్యాచారాలు ఆగాలంటే ఇస్లామిక్ శిక్షలు విధించాలి. వీటిని చూసి స్త్రీ జాతిని వంకరబుద్ధితో చూసే మృగాళ్లకు వెన్నులో వణుకు పుట్టాలి. అప్పుడే ఈ ఘోరాలకు చెక్ పెట్టవచ్చు.

No comments:

Post a Comment