Who is Allah -
అల్లాహ్
ఎవరు?
(సృష్టికర్త-సృష్టితాలు)
సృష్టికర్త-సృష్టితాలు
యావత్మానవాళిని
సృష్టించి, పోషించి, పాలించే దేవుడు
మాత్రమే
మానవులకు
సరైన రుజుమార్గం (జీవిత విధానం) చూపగలుగుతాడు. కనుక ఆయన మాత్రమే
ఆరాధనకు అర్హుడు. మిగిలిన వారంతా సృష్టితాలు, దాసులు, పాలితులు మాత్రమే.
అలాగే మానవులు పరస్పరం సహాయసహకారాలు
అందవేసుకుంటున్నప్పటికీ అసలు నహాయం చేసేవాడు దేవుడు మాత్రమే. కాబట్టి
మానవులు తమ అవసరాల కోసం అయన్ని మాత్రమే అరించాలి.
ఏకేశ్వర భావం ప్రతి
మానవుని నైజంలొనే వేళ్ళూని ఉంది. అయితే ఆచరణలోనే అనేకమంది ఈ సత్యానికి కట్టుబడి
ఉండలేకపోతున్నారు. ఒకే
దేవుడ్ని ఆరాధిన్తున్నామని చెబుతూనే కొన్ని చేష్టల ద్వారా బహుదైవోపాననకు
పాల్పడుతున్నారు. దీనిక్కారణం దివ్యావష్కతి (Revelation) ని పొందిన
దైవప్రవక్తలను గుర్తించకపోవడం; గుర్తించినా
వారి బోధనలను మార్చివేయడం, పెడర్ధాలు తీయడం; ఆయా మార్పులకు, పెడర్ధాలకు “సహేతుకమైన” సాకులు చూపి తమ
వాదనలే నిజమని నిరూపించడానికి వృధాప్రయాస పడటం జరుగుతోంది.
దేవుళ్ళు అనేకమంది
ఉన్నారని భావించినప్పుడు “కస్మై
దేవాయ
హవిషా
విధేమ?” (ఏ దేవునికి మా
హవిస్సుల నివ్వవలెను?) అనే
ప్రశ్న
ఉదయిస్తుంది.
ఈ ప్రపంచానికి,
ఇక్కడి
సుఖదుఃఖ్ఖాల వ్యవస్థకు కారణం “ఏకోబ్రహ్మమే” అని నిర్దారించుకున్నప్పుడు
“అ బ్రహ్మ లక్షణాలు ఏవి?” అనే మరో ప్రశ్న
ఉద్భవిస్తుంది. ఆ బ్రహ్మ లక్షణాలన్ని కలిగివున్న సమగ్ర పదమే “అల్లాహ్". 'అల్+ఇలావ్' అనే రెండు పదాలు కలసి
ఒకేదేవుడు, The
God
అనే భావం స్ఫురించేలా 'అల్లాహ్' అనే పదం ఏర్చడింది. ఈ పదమే ఆ శుద్ధ
ఏకబ్రహ్మకు నామవాచకమైపోయింది.
“ఇలాహ్” అంటే ఆపద సమయంలో
అదుకునేవాడు,
భయాందోళనలు
కలిగినప్పుడు శాంతి స్థిమతాలు ప్రసాదించేవాడు, కష్టాలను కడతేర్చి
నుఖాన్నిచ్చేవాడు,
శరణుగోరినవారికి
అశ్రయ మిచ్చేవాడు,
కోర్కెలు
తీర్చేవాడని నానార్ధాలున్నాయి. అరబీ భాషలో ఈ పదాలలో ఆధిక్యతాభావం (Supremacy) కూడా ఇమిడి ఉంది.
ఆధిక్యత ఉన్న చోటికే
అవసరార్థులు గుమికూడటం సహజం. కనుక ఆధిక్యత కలిగివున్నవాడు అర్థులకు ఆరాధ్యుడైపోతాడు.
ఈ విధంగా
“ఇలాహ్' అనే పదంలో అర్థించదగినవాడు, ఆరాధించదగినవాడు, ఆశ్రయమిచ్చేవాడు, అపదల మొక్కులవాడు అనే
అర్థాలున్నాయి. బహు దైవారాధనాభావం
కలిగినవారంతా ఈ అర్థల్లోనే అసాధారణ శక్తి ఉందని భావించిన ప్రతి
సృష్టితాన్ని (Creature)
పూజించడం
ప్రారంభించారు. చివరికి
ఏకేశ్వరవాదులమని చెప్పుకునేవారు సైతం ఏకాగ్రత కోనమనో, లేక దేవునికి
ప్రతిరూపాలనో భావించి సృష్టిపూజకు అలవాటుపడ్డారు.
అయితే ఇస్లాం
ఏకేశ్వరవాదానికి నంబంధించి విశ్వాసానికి, ఆచరణకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని
ఖండించింది. అ “ఇలాహ్” (ఆరాధ్యుడు) ఒక్కడేనని, ఆయన తప్ప వేరే
ఆరాధ్యుడు లేడని ఆయనే “అల్లాహ్' అని నమ్మడంతో పాటు
ఆచరణరీత్యా కూడా అ ఒక్కడినే ఆరాధించాలని, ఆయన్నే వేడుకోవాలని, జీవితంలోని ప్రతి
వ్యవహారంలోనూ ఆయన ఆజ్ఞలను మాత్రమే శిరసావహించాలని చెబుతోంది.
“దేవుడ్ని వదలి నీకు
ఎలాంటి లాభంగాని,
నష్టంగాని
కలిగించ లేని మిధ్యాదైవాలను
ఎన్నటికీ ప్రార్థించకు. అలా చేస్తే నీవు దుర్మార్గుడవై పోతావు. దేవుడు నిన్ను ఏదైనా
కష్టానికి గురిచేయదలిస్తే ఆయన తప్ప ఆ కష్టం నుండి నిన్ను
గట్టెక్కించేవారెవరూ ఉండరు.” (ఖుర్ఆన్-10:105, 106)
“నా దాసులు నా గురించి
అడిగితే నేను వారికి చేరువలోనే ఉన్నానని చెప్పు. మొరపెట్టకునేవాడు నన్ను
మొరపెట్టుకుంటున్నప్పుడు నేనతని మొరాలకించి, దానికి సమాధానం
ఇస్తానని కూడా చెప్పు. అయితే వారు నా సందేశం స్వీకరించి నాపట్ల పూర్తి
విశ్వాసం కలిగివుండాలి. అప్పుడేవారు సన్మార్గం పొందగలరు.” (ఖుర్ఆన్-2: 186)
అంతిమ దైవప్రవక్త
మహనీయ ముహమ్మద్ (స) ఒక హదీసులో దేవుని మాటలు ఇలా తెలిపారు: “నా దాసులారా! నేను
మార్గం చూపినవాడు తప్ప మీలో ప్రతి ఒక్కడూ మార్గవిహీనుడే. కనుక సన్మార్గం
చూపమని నన్ను వేడుకోండి, నేను
మీకు సన్మార్గావలంబన బుద్ధి ప్రసాదిస్తాను. నా దాసులారా! నేను ఉపాధి
ప్రసాదించినవాడు తప్ప మీలో ప్రతిఒక్కడూ క్షుత్భాధితుడే. కనుక ఉపాధి ప్రసాదించమని
నన్ను మొరపెట్టుకోండి, నేను
మీకు ఉపాధినిస్తాను. నా దానులారా! నేను వస్త్రాలు ప్రసాదించినవాడు తప్ప మీలో ప్రతిఒక్కడూ వస్త్రవిహీనుడే.
కావున వస్త్రాలు ప్రసాదించమని నన్ను అర్ధించండి, నేను మీకు వస్త్రాలు
ప్రసాదిస్తాను. నా దానులారా! మీలో వ్రతి ఒక్కడూ రేయింబవళ్ళు పాపాలు
చేస్తున్నవాడే. నేను మీ పాపాలన్ని క్షమిస్తాను. కనుక మీరు పాపక్షమాపణ కోసం
నన్ను ప్రార్థించండి, నేను మీ పాపాలు
క్షమిస్తాను.”
(ముస్లిం)
యావత్తు
విశ్వవ్యవస్థను సృష్టించి నిర్వహిస్తున్న సృష్టికర్త మాత్రమే సృష్టితాలకు
ఆరాధ్యుడవుతాడు. అలాగే నృప్టితాలు ఆ ఎకైక అరాధ్యుడ్ని దేవుడిగా
ఆరాధించేవారు మాత్రమే అవుతారు. అంతేగాని ఏ సృష్టితం కూడా ఆరాధ్యదైవం
కాజాలదు. అ ఏకైక దేవుడే సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు, పరబ్రహ్మ
పరాతత్పరుడు. ఆయన దైవత్వం అవిభాజ్యమైనది. అజ్ఞానులు, స్వార్థపరులు, ఏమరుపాటుకు
లోనయ్యేవారు ఈ వాస్తవాన్ని
జీర్ణించుకోలేక సృష్టితాలక్కూడా దైవత్వాన్ని అంటకడ్తున్నారు.
ఏకేశ్వరోపాసనకు
సంబంధించిన ఈ ఒక్క విషయాన్ని మానవులకు తెలియజేయడానికి ఒక లక్షా, ఇరవై నాలుగు వేల(1,24,000) మంది దైవప్రవక్తలు ఉద్భవించారు. అంతిమ
దైవప్రవక్త ముహమ్మద్ (న) ద్వారా పంపబడిన దివ్యఖుర్ఆన్ లో ఈ విషయం మరింత వివరంగా, వివిధ రకాలుగా బోధించబడింది. అయినా
ప్రజలలో అత్యధికమందికి ఈ చిన్న విషయం అర్ధం కాకపోవడం విచారకరం.
ఇలా దైవత్వం ఆపాదించబడిన
సృష్టితాలలో ప్రకృతిశక్తులతో పాటు మతనాయకులు, జాతినేతలు, గురువులు, భర్తలు కూడా చేరిపోయారు.
అంతేకాదు, చివరికి జంతువులు, పక్షులు, రాళ్ళు, రప్పలు,మర్మావయవాలు కూడా
ఆరాధ్యదైవాలై పోయాయి. ఏవిధంగానైనా సరే ప్రాపంచిక ప్రయోజనాలు లభిస్తే చాలని
భావించిన అనేకమంది ప్రజలి బహుదైవారాధనా ఉన్మాదంలో పడి నిజదేవుడ్నే
మరచిపోయారు. ఇహలోకం పరీక్షాగృహంగా నిర్ణయించబడినందున వారు బహుదైవారాధనా దుష్పర్యవసానం
పరలోకంలో తప్పక చవిచూడవలసి ఉంటుంది.
Alhamdulillah..
ReplyDeleteMasha allah..
ReplyDelete