ఇస్లాం అంటే ఏమిటి? - ఇస్లామీయ సందేశమేమిటి?
ఇస్లాం విశ్వమానవ ధర్మం
ఇస్లాం అంటే
సృష్టికర్త అయిన దైవానికి సంపూర్ణ ఆత్మ సమర్పణ, దైవ విధేయత. దీని ద్వారానే మనిషి నిజమైన
శాంతిని పొందగలడు.
ఇస్లామీయ సందేశం చాలా
సులువైనది:
1. ఒకే ఒక్క నిజమైన
దేవుడ్ని అల్లాహ్ విశ్వసించాలి. ఆయనను
మాత్రమే ఆరాధించాలి.
2. ప్రవక్త ముహమ్మద్(స)
చిట్టచివరి దైవప్రవక్తగా విశ్వసించి ఆయనను అనుసరించాలి.
ఇస్లాం అంటే ఎమిటి? ముస్లింలు ఎవరు? ఇస్లాం వ్రకృతి ధర్మమా? మనిషి ముస్లింగానే
ఎందుకు ఉండాలి? ఇస్లాం ధర్మ ప్రాథమిక విధులు ఏవి?
ప్రపంచంలో అనేక మతాలు
లేవు. ఒకవేళ ఉన్నా అవన్నీ దేవుని సన్నిధిలో ఆమోదించబడవు. మొట్టమొదటి ప్రవక్త ఆదం (అలైహిస్సలామ్)
నుంచి చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వరకు
దైవప్రవక్తలందరిదీ ఒకే మతం. అదే ఇస్లాం. దివ్యఖుర్‌ఆనలో మూడవ సూరాలోని 19వ సూక్తిలో ఇలా
సెలవీయబడింది;
“అల్లాహ్ దృష్టిలో
ధర్మం కేవలం ఇస్లాం మౌత్రమే.”
“ఇస్లాం' అనే పదానికి అర్పణం, లొంగిపోవటం, కట్టుబడి ఉండటం, విధేయత చూపటం,స్వయం సమర్పణ, శిరసావహింపు, ఆజ్ఞపాలన అనే అర్థాలు
ఉన్నాయి. దేవునికి, దేవుడు
సూచించిన జీవన సంవిధానానికి తిరుగులేని విధంగా కట్టుబడి ఉండటమే ఇస్లాం మతం. ఇస్లాం
మానవాళి కొరకు సమ్మతించి ఆమోదించబడిన సత్యధర్మం. ఇస్లాం ధర్మాన్ని అనుసరించేవారు “ముస్లింలుగా పిలువబడతారు.
ముస్లింలు దేవుని ఏకత్వంపై తిరుగులేని విశ్వాసం కలిగి ఉంటారు. దైవత్వంలో
మరెవ్వరికీ భాగస్వామ్యం అంటగట్టరు. దేవుడు సూచించిన జీవన సంవిధానాన్ని మనసా వాచా
కర్మణా ఆచరిస్తారు.
ఇస్లాం ప్రకృతి
ధర్మమని ఎలా చెప్పగలము?
ప్రపంచంలోని
మతాలన్నింటినీ ఒకసారి పరిశీలించండి. క్రీస్తు ప్రవక్త అనుయాయులు తమ మతానికి తమ
ప్రవక్త పేరే పెట్టుకున్నారు. సింధూ నదీతీరాన ఆవిర్భవించిన మతం సింధూ లేక
హిందూమతంగా ప్రఖ్యాతిగాంచింది. యూదుల్లోని ఒక ప్రత్యేక తెగ యహూదా మూలంగా
యూదమతానికి ఆ పేరు వచ్చింది. గౌతమ బుద్దుడు స్థాపించిన మతం బౌద్ధ మతం అయింది. ఈ
విధంగా ప్రపంచంలోని ఇతర మతాలన్నీ కూడా వాటిని స్టాపించినవారి పేర్లతోనో లేక అవి
ఆవిర్భవించిన ప్రాంతం, తెగల
పేర్లతోనో నామకరణం చేయబడ్డాయి.
కాని ఇస్లాం మాత్రం
వీటన్నింటికీ భిన్నంగా ఒక సహజమైన పదంతో నామకరణం చేయబడింది. ఇస్లాం అంటే కట్టుబడి
ఉండటం. విధేయత చూపటం. సృష్టి తన సృష్టికర్తకు విధేయత చూపుతుంది. అతని ఆజ్ఞలకు
లోబడీ మసలుకుంటుంది. అదే విధంగా మనిషి తన సృష్టికర్తకు విధేయత చూపుతూ, ఆయన ఆజ్ఞలను
శిరసావహిస్తూ జీవించటమే ఇస్లాం ధర్మం.
మనిషి ముస్లింగానే
ఎందుకు ఉండాలి?
దేవుడు మనిషిని
పుట్టించి తాను అతని కోసం నిర్ణయించిన జీవనవిధానమేదో అతనికి తన ప్రవక్తల ద్వారా
తెలియపరిచాడు. ధర్మాధర్మాలను పరికించి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలు
కూడా అతనిలో పొందుపరచాడు. మానవుడు బుద్దిజీవి. విశ్వంలోని ఇతర సృష్టిరాశుల్లాగా
తను కూడా సృష్టికర్త నిబంధనావళికి, ఆయన సూచించిన జీవన సంవిధానానికి కట్టుబడి
ఉండాలనీ, ఆయన దృష్టిలో ఇస్లాం
మాత్రమే సత్యధర్మమనీ అతని అంతరాత్మ మాటిమాటికీ ప్రబోధిస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు
మనిషి ఇస్లాం ధర్మాన్ని వదలిపెట్టి ఇతర మతాలను ఆశ్రయిస్తే అతని సృష్టికర్త దాన్ని ఎలా
అంగీకరిస్తాడు?
దివ్యఖుర్‌ఆన్‌లో
మూడవ సూరాలోని 85వ సూక్తిలో ఇలా
చెప్పబడింది:
“ఎవడైనా ఈ విధేయతా
మార్గాన్ని (ఇస్లామ్‌ను) కాక మరొక మార్గాన్ని అవలంబించదలిస్తే ఆ మార్గం ఎంతమౌత్రం ఆమోదించబడదు.
అలాంటివాడు పరలోకంలో విఫలుడవుతౌడు, నష్టపోతాడు.”
ఇస్లాం ధర్మ ప్రాథమిక
విధులు
ప్రాథమిక విధులు
ఇస్లాం ధర్మానికి ప్రాణం వంటివి. ఇస్లాం ధర్మాన్ని ఒక పటిష్టమైన భవనంగా గనక
ఊహించుకుంటే ప్రాథమిక విధులు దాని స్తంభాల్లాంటివని చెప్పవచ్చు. వాటిలో ఏ ఒక్క
స్తంభం బలహీనమయినా ఇస్లాం భవనం మొత్తం కుప్పకూలిపోయే ప్రమాదముంది. ఆ ప్రాథమిక
విధులు ఐదు:
1. కలిమా (అల్లాహ్ తప్ప
వేరొక ఆరాధ్య దేవుడు లేడనీ, ముహమ్మద్ దైవప్రవక్త అని
మనస్ఫూర్తిగా అంగీకరించి నోటితో పలకటం)
2. నమాజ్ వ్యవస్థ
నెలకొల్పటం
3. జకాత్ (విధి దానం)
సొమ్ము చెల్లించటం
4. రమజాన్ మాసంలో
ఉపవాసాలు పాటించటం
5. స్థోమత కలిగినవారు
కాబా గృహ యాత్ర (హజ్) చేయటం.
No comments:
Post a Comment