Hellobar

Monday, January 7, 2019

Quraan Challenge - ఖుర్ఆన్ ఛాలెంజ్

 ఖుర్ఆన్ ఛాలెంజ్ 

దివ్యఖుర్ఆన్ లోని భాషశైలిని, విషయతీరును గమనిస్తే, ఇది తప్పకుండా దైవవాణి అని మన అంతరాత్మ అప్రయత్నంగా ఘోషిస్తుంది. అందువల్ల ఖుర్ఆన్ లోని సూక్తుల్ని, వాటి శైలిని పరిశీలించి ప్రశాంతంగా ఆలోచించమని దేవుడు మానవుల్ని కోరుతున్నాడు.

" వారు ఖుర్ఆన్ గురించి ఆలోచించరా? ఇది అల్లాహ్ వద్ద నుండి కాక మరెవరి వద్ద నుండో వచ్చి ఉంటే ఇందులో ఎంతో భావవైరుధ్యం ఉండేది కదా!" (ఖుర్ఆన్ - 4:82)

దివ్యఖుర్ఆన్ దైవవాణియా కాదా  అని అనుమానం ఉన్నవారికి స్వయంగా ఖుర్ఆన్ ఇలా ఒక సవాలు విసురుతోంది:

" ఒకవేళ మా దాసుని పై అవతరింపజేసిన ఈ గ్రంధం పట్ల మీకు ఏదైనా అనుమానం ఉంటే, ఖుర్ఆన్ లో ఉన్నటువంటి ఓ అధ్యాయం రచించి తీసుకురండి. ఈ పని కోసం ఒక్క అల్లాహ్ ను వదిలి మీ సహాయకులందరినీ పిలుచుకోండి. మీరు సత్యవంతులైతే  ఈ పని చేసి చూపండి. మీరు ఈ పని చేయలేకపోతే ** ఎంతమాత్రం చేయలేరు. మనుషులు, రాళ్ళు ఇంధనం కాగల నరకాగ్నికి భయపడండి. సత్యతిరస్కారుల కోసం అది సిద్దపరచబడి ఉంది."(ఖుర్ఆన్ - 2:23-24)

ఈ సవాలును ఈనాటివరకు ఎవరూ ఎదురుకోలేక పోయారు. దైవప్రవక్త ముహమ్మద్(స) కాలంలో గొప్ప గొప్ప కవులు, రచయితలు ఈ సవాలును ఎదురుకోలేక చేతులెత్తేశారు. 




No comments:

Post a Comment