Hellobar

Monday, December 20, 2021

స్త్రీ పురుషుల శిరోజాలలో కృత్రిమ సవరము పెట్టుకొనుట

 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను


స్త్రీ పురుషుల శిరోజాలలో కృత్రిమ సవరము పెట్టుకొనుట


                 అస్మా బిన్తె అబూబకర్ కథనం: ఒక స్త్రీ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి "ప్రవక్తా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)! నా కూతురికి స్ఫోటకము అయి తల వెంట్రుకలు రాలిపోయాయి. నేనామెకు ఇప్పుడు పెళ్ళి చేశాను. మరి ఆమె తలలో సవరము పెట్టవచ్చా?" అని అడిగింది. దానికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) "సవరము పెట్టుకునే స్త్రీకి, పెట్టుకోమని ప్రేరేపించే స్త్రీకి దైవశాపం కలుగుతుంది" అని అన్నారు. (తిర్మిజీ 1759, 2783, బుఖారీ 5335, 5336, 5341, ముస్లిం 2124)


                హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (ర) ఉల్లేఖించారు:

               "స్త్రీ తన శిరోజాల్లో కృత్రిమ సవరము పెట్టుకొనుటను నిషేధించారు." (ముస్లిం 2126)


               ఈ రోజుల్లో “విగ్” రూపంలో ఇది చెలామణిలో ఉంది. ఈ నిషిద్ధ కార్యము జరిగే స్థలాన్ని బ్యూటిపార్లర్ అంటారు. అచ్చట ఇంకా చెప్పరాని దుష్కార్యాలు జరుగుతాయి.


                దీనికి సంబంధించిన మరో నిషిద్ధత ఎరువిచ్చుకునే వెంట్రుకలు, డ్రామాల్లో, ఫిల్ముల్లో పనిచేసేవాళ్ళు, (వాళ్ళకు అనుకరించేవాళ్ళు) వీటిని ఉపయోగిస్తారు. ఇలాంటి వారికి (పరలోక సాఫల్యంలో) ఏ భాగమైనా లభించదు.

No comments:

Post a Comment