“రోజా పాటింపులో సహ్రీ తినడం ద్వారా సహాయం తీసుకోండి. అలాగే తరావి నమాజ్ నిర్వహణలో మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవడం ద్వారా సహాయం తీసుకోండి. అన్నారు దైవప్రవక్త (స)- (ఆసాన్ ఫిఖ్కా, రెండవ భాగం)
తీవమైన ఆకలిదప్పులతో ఢీలాపడిపోయి, కళ్ళు లోపలికి పీక్కుపోయి, జీవచ్చమై ఉండే మనిషికి “గుక్కెడు గంజినీళ్ళు దొరికినా చాలు, అమితమైన సంతోషంతో పొంగిపోతూ దాన్ని అమృతంలా సేవిస్తాడు. అతని కళ్ళలో దైవం పట్ల కృతజ్ఞతాజ్యోతులు వెలిగిపోతాయి”.
"ఉపవాసం పాటించే మనిషికి రెండు సంతోషకరమైన విషయాలు ఊన్నాయి. ఒకటి ఉపవాస విరమణ సమయంలో. రెండు, తన ప్రభువును సందర్శించే సమయంలో. ఉపవాసం పాటించే మనిషి నోటి
వాసన దేవునికి కస్తూరీ సువాసన కన్నా ఎంతో ప్రియమయినది." (బుఖారి, ముస్లిం)
సూర్యాస్తమయం కాగానే ఉపవాస విరమణ (ఇఫ్తార్) కోసం ఇలా దుఆ చేయాలి:“అల్లాహుమ్మ లక సుమ్తు వఅలా రిజ్ఖిక అఫ్తర్తు' (దేవా! నేను నీ కోసం రోజా పాటించాను. నీవు ప్రసాదించిన ఆహారంతోనే రోజా విరమిస్తున్నాను) ఇలా దుఆ చేసిన తరువాత ఖర్జూర పండ్లుగాని, మరేదయినా పదార్థంగాని తినడం ద్వారా ఇఫ్తార్ చేయాలి. ఇఫ్తార్ చేసిన తరువాత ఇలా 'దుఆ' చేయడం మంచిది: “జహబజ్జమఉ వబ్తల్లతిల్ ఉరూఖు వసబతల్ అజ్రు ఇన్షాఅల్లాహ్” (దాహం తీరింది. నరాలు నిండిపోయాయి. దేవుడు తలిస్తే ప్రతిఫలం కూడా తప్పక లభిస్తుంది.) (అబూదావూద్)
సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్ కోసం ఆలస్యం చేయకూడదు. సహ్రీ ఆలస్యంగా చేయాలని, ఇఫ్తార్ తొందరగా చేయాలని దైవప్రవక్త (స) ఆదేశించారు. ఆ మహనీయుని ఆదేశం పాటించడం కంటే గొప్ప ధర్మపరాయణత మరేం కాగలుగుతుంది?
దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: "ప్రజలు ఉపవాస విరమణ (ఇఫ్తార్) తొందరగా చేస్తున్నంత కాలం మంచికి కట్టుబడి ఉంటారు.” (బుఖారి, ముస్లిం)
దైవప్రవక్త (స) ప్రవచనం: “రాత్రి(చీకటి) అటువైపు నుంచి రావడం ప్రారంభమై,పగలు(వెల్తురు) ఇటువైపు నుంచి (కనుమరుగై) పోవడం మొదలై సూర్యుడు అస్తమించినప్పుడు ఉపవాసికి అతని ఉపవాస వేళ ఆరంభమవుతుంది. ' (ముత్తఫకున్ అలై)
దైవప్రవక్త (స) దేవుని మాటలను ఇలా తెలిపారు: “నా దాసులలో అందరికంటే ఉపవాస విరమణలో తొందర చేసేవారే నాకెక్కువ ప్రియమైనవారు.. (తిర్మిజి)
హజ్రత్
ఇబ్నె అబీ బెఫా (రజి) కథనం: మేమొక సారి దైవప్రవక్త (సల్లం)తో కలసి ప్రయాణం
చేస్తున్నాం. అప్పుడు దైవప్రవక్త (స) ఉపవాసంతో ఉన్నారు. సూర్యుడు కనుమరుగైపోగానే
ఆయన (మాలో) ఒకతడ్ని ఉద్దేశించి “దిగు. దిగి నాకోసం సత్తుపిండి కలిపితీసుకురా”
అన్నారు. అతనీ మాట విని “దైవప్రవక్తా!
ఇంకాస్సేపు ఆగండి, చీకటి అలుముకుంటే మంచిది కదా!” అన్నాడు. కాని దైవప్రవక్త (స) అతడ్ని మళ్ళీ ఆదేశిస్తూ
“వాహనం దిగి నాకోసం సత్తుపిండి కలిపి తీసుకురా అన్నారు. దానికా వ్యక్తి
"దైవప్రవక్తా! పగటి వెల్తురు ఇంకా ఉంది కదా! (ఇంకాస్సేపు ఆగితే మంచిదేమో) '
అన్నాడు. దైవప్రవక్త
(స)
మళ్ళీ “వాహనం దిగి నాకోసం సత్తుపిండి కలిపి తీసుకురా” అన్నారు.
అప్పుడతను
వాహనం దిగి మాఅందరి కోసం సత్తుపిండీ తయారుచేశాడు. దైవప్రవక్త (స) సత్తుపిండి తిని “రాత్రిచీకటి
అటు(తూర్చు) వైపు నుండి అలుముకోనారంభించడం చూడగానే ఉపవాసి తన ఉపవాసాన్ని
విరమించాలి” అన్నారు. (బుఖారి)
హజిత్
వైద్ బిన్ ఖాలిద్ (రజి) ప్రకారం దైవప్రవక్త (స) ఇలా అన్నారు: “ఒక
వ్యక్తి ఏ ఉపవాసికైనా ఉపవాస విరమణ చేయిస్తే లేదా ఏ యోధుడి కోసమైనా (యుద్ధ) సామగ్రి
సరఫరా చేస్తే అలాంటి వ్యక్తికి ఉపవాసికి ఉపవాసం పాటించినందుకు లభించే, యోధుడికి యుద్ధం చేసినందుకు లభించే పుణ్యమే లభిస్తుంది.” (బైహఖి)
No comments:
Post a Comment