“(విశ్వాసులారా!) మీరు
అమితంగా ప్రేమించేవాటిని సైతం (దైవమార్గంలో) వినియోగించనంత వరకూ మీరు
ధర్మపరాయబణులు కాలేరు.” (ఖుర్‌ఆన్-3:92)
“మీలో దేవునికి రుణమిచ్చే
వారెవరైనా ఉన్నారా? శ్రేష్టమైన రుణం? అలాంటి వారికి దేవుడు ఆ రుణాన్ని
అనేకరెట్లు పెంచి తిరిగి ఇచ్చివేస్తాడు. పైగా వారికి అత్యంత శ్రేష్టమైన ప్రతిఫలం
కూడా లభిస్తుంది.” (ఖుర్ఆన్-57:11)
హజత్ అబుదహ్ద
అన్సారీ (రజి) ఈసూక్తి (57:11) విని "దైవవ్రక్తా! దేవుడు మనల్ని అప్పు అడుగుతున్నాడా?” అని ప్రశ్నించారు.
దానికి ఆయన అవునన్నారు. ఆప్పుడు అబుదహ్ద (రజి) “అయితే కాస్త మీ చేయి
జాపండి”
అన్నారు.
దైవప్రవక్త (స) చేయిజాపారు. హజ్రత్ అబుదహ్ద (రజి) ఆయన చేతిని తన చేతిలోకి
తీసుకొని "నేను నా ప్రభువుకు నా తోటను (అప్పుగా) ఇస్తున్నాను” అని చెప్పారు.
అబుదహ్ద (రజి) తోటలో
ఆరొందల ఖర్జూర చెట్లున్నాయి. తోటలోనే ఇల్లు కూడా ఉంది. అక్కడే ఆయన భార్యాపిల్లలు
నివసిస్తున్నారు. ఈమాట చెప్పి ఆయన తోట దగ్గరికి వెళ్ళి “ఉమ్మెదహ్ద! బయటికి
వచ్చేసేయి. నేని తోటను నా ప్రభువుకు అప్పుగా ఇచ్చేశాను” అన్నారు. ఆయన భార్య
కూడా ఎంతో సాధ్వీమణి. ఆమె ఈ మాటలు విని “మీరు చాలా లాభదాయకమైన
వ్యాపారమే చేశారు” అన్నారు. అప్పటికప్పుడు ఆయన తన ఇంటి సామగ్రిని, భార్యాపిల్లలను
తీసుకొని తోటలో నుంచి బయటికి వచ్చేశారు.
రోమన్లు మదీనాపై
దాడిచెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం అందడంతో దైవప్రవక్త (సల్లం)
వారిని ఎదుర్కోవడానికి “తబూక్"
దండయాత్రకు సన్నాహాలు చేయవలసి వచ్చింది. సిరియా సరిహద్దున గల తబూక్ ప్రాంతానికి
ముస్లిం యోధులు సుదీర్ఘ ప్రయాణం చేయవలసి ఉండింది. పైగా అది తీవ్రమైన ఎండాకాలం.
పకడ్బందీగా భారీఎత్తు సన్నాహాలు చేయడానికి అత్యధిక ఆయుధాలు, ఆహార పదార్థాలు, వాహనాలను
సమికరించవలసి వచ్చింది. అందువల్ల దైవప్రవక్త (సల్లం) ధన, కనక, వస్తు త్యాగాల కోసం
ప్రజలను ప్రేరేపించారు.
దైవప్రవక్త (స) బోధతో
ఉత్తేజితులైన ప్రజలు విశాలహృదయంతో భారీ విరాళాలు అందజెయ్యడం ప్రారంభించారు. కొందరు
ధర్మసంస్థాపనా మార్గంలో తమ సర్వస్వం త్యాగం చెయ్యాలన్న వీరావేశంతో తమ శక్తికి
మించిన విరాళాలు కూడా ఇచ్చారు.
హజ్రత్ ఉస్మాన్
(రజి) వేయి దీనార్‌ల విలువగల వస్తువుల్ని దైవప్రవక్త (సల్లం)కు అందజేశారు. ఆయన
ధనికులైనప్పటికీ ఈ విరాళం ఆ కాలంలో అత్యధికమైనదే.
హజత్ ఉమర్(రజి)
ధనత్యాగం విషయంలో అబూబకర్ (రజి)ని మించిపోవాలని నిర్ణయించుకొని తన యావదాస్తిలో
అర్ధభాగం తీసుకొని వచ్చారు. దైవప్రవక్త (సల్లం) అది చూసి “భార్యాపిల్లల కోసం
ఏమైనా మిగిల్చి పెట్టావా లేదా?” అని
అడిగారు. దానికి హజ్రత్ ఉమర్ "వాళ్ళ కోసం సగం వదలిపెట్టాను” అన్నారు.
ఆ తర్వాత హజ్రత్
అబూబకర్ (రజి) ఇంట్లో ఉన్నదంతా ఊడ్చీ తెచ్చి ప్రవక్త (స) పాదాల చెంత పోశారు. ఈ
అసాధారణ దాతృత్వం చూసి ఆయన ఆశ్చర్యంతో “అబూబకర్! ఉన్నదంతా తెచ్చినట్టుంది. మరి
ఇంట్లో భార్యాపిల్లల కోసం ఏం వదలి పట్టావు?” అని అడిగారు. “భార్యాపిల్లల కోసం దేవుడు, దైవప్రవక్త చాలు” అన్నారు అబూబకర్
(రజి).
పాపం అబూఖలీల్(రజి)
దగ్గర విరాళం ఇవ్వడానికి ఏమీ లేదు. ఆయన కూలినాలి చేసి బ్రతికే నిరుపేద శ్రమజీవి.
ఒక్కోరోజు ఆ కూలిపని కూడా దొరక్క కుటుంబం పస్తులుండవలసి వచ్చేది. అయితే దైవప్రవక్త
(స) ప్రకటన వినగానే అబూఖలీల్(రజి) ఓ తోటయజమాని దగ్గరికెళ్ళి చెట్లకు నీళ్ళు
తోడీపోస్తానని చెబితే అతను ఒప్పుకున్నాడు. ఆ రోజు అబూఖలీల్(రజి) ఇషానమాజ్ తరువాత
' తోటకెళ్ళీ రాత్రి
తెల్లవారేదాకా బావి నుంచి నీళ్ళు తోడారు. ఇంత కష్టపడితే యజమాని ఆయనకు నాలుగు సేర్లు
ఖర్జూరపండ్లు ఇచ్చాడు. అబూఖలీల్ (రజి) వాటిని తీసుకొని సంతోషంగా ఇంటికి వచ్చారు. ఆ
ఖర్జూర పండ్లలో సగం భార్యాపిల్లల కోసం వదలిపెట్టి మిగతా సగం పండ్లు మూటకట్టుకొని
ఆయన దైవప్రవక్త (స) సన్నిధికి వెళ్ళారు. కాని జనం పెద్దపెద్ద విరాళాలు ఇస్తుంటే
తాను ఈ చిన్న విరాళం ఇవ్వాల్సి వస్తున్నదే అని భావించి సిగ్గుపడి పోతున్నారు. అందువల్ల
ఆయన ఓ క్షణం అటూ ఇటూ చూసి ఆ పండ్ల మూటను విరాళాల కుప్పలో ఎక్కడో అడుగు భాగాన
పెట్టేశారు సిగ్గుపడుతూనే. కాని దైవప్రవక్త (స) అది గమనించారు. వెంటనే ఆయన ఆ పండ్ల
మూటను అక్కడ్నుంచి తీసి విరాళాల కుప్పలో అన్నిటికన్నా పైభాగాన పెట్టేశారు.
అబూఖలీల్(రజి) అది చూసి ఎంతో సంతోషించారు. (మిష్కాత్)
హజ్రత్ అబూతల్హా
(రజి) మదీనాలోని అన్సార్ ముస్లింలలో
కెల్లా గొప్ప ధనికులు. ఆయనకు (అనేక) ఖర్జూరపు తోటలుండేవి. వాటిలో 'బైరహ' తోటంటే ఆయనకు
ఎంతోఇష్టం. ఖుర్‌ఆన్ లో 3:92
సూక్తి అవతరించినపుడు ఆయన ఇలా అన్నారు:
“దైవప్రవక్తా! మీకు
అత్యంత ప్రియమైన వస్తువుని దైవమార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్యస్థాయికి
చేరుకోలేర'ని దేవుడు
సెలవిస్తున్నాడు కదా! 'బైరహ' తోట నాకెంతో
ఇష్టమైనది. అంచేత నేనా తోటను దైవమార్గంలో దానం చేస్తున్నాను. దైవం నుండి దాని పుణ్యఫలం ఆశిస్తున్నాను.
పరలోకంలో అది నాకోసం గొప్పనిధిగా తయారవుతుందని నమ్ముతున్నాను. దైవప్రవక్తా! మీరు
దైవాజ్ఞ ప్రకారం దాన్ని ఉపయోగించండి.”
అప్పుడు దైవప్రవక్త
(స) ఇలా అన్నారు: “చాలా
మంచిది. ఇదెంతో లాభదాయకమైన సంపద. నిజంగా ఇదెంతో లాభదాయకమైన సంపద. నీ మాటలు నేను
విన్నాను. అయితే నాదొక సలహా. ఆ తోటను ని (పేద) బంధువులకు పంచివ్వు.” హజత్ అబూతల్హా (రజి)
ఈమాట వని “నేను మీ ఆజ్ఞ
శిరసావహిస్తున్నాను” అన్నారు.
తర్వాత ఆయన ఆ తోటను తన పెదనాన్న, చిన్నాన్న
కొడుకులకు, ఇతర బంధువులకు
పంచివేశారు. (బుఖారి)
అబ్దుల్లా బిన్ ఉమర్
(రజి) కథనం: ప్రవక్త అనుచరులలో ఒకతనికి ఎవరో కానుకగా ఓ మేకతల ఇచ్చారు. అప్పుడతను “దీన్ని నా మిత్రుడు
ఫలానాకు ఇవ్వండి,
అతను
నాకంటే ఎక్కువ అగత్యపరుడు” అన్నాడు.
ఆ వ్యక్తి దాన్ని అతని దగ్గరకు పంపాడు. కాని అతను కూడా "దీన్ని నా మిత్రుడు
ఫలానాకు ఇవ్వండి,
అతను
నాకంటే ఎక్కువ అగత్యపరుడు” అన్నాడు.
ఈవిధంగా ఆ మేకతల ఏడుగురి దగ్గరకు చేరుకున్న తర్వాత చివరికి మొదటి మనిషి దగ్గరకు
తిరిగొచ్చింది.”
(సహీఫతుల్‌హఖ్)
No comments:
Post a Comment