1. ముస్లిం అయిన ప్రతి
వ్యక్తికి అతను స్వేచ్భాపరుడయినా లేక బానిస అయినా, స్తీ అయినా పురుషుడయినా, పెద్దవాడయినా, పిన్నవాడయినా ఫిత్రా దానం చేయటం విధి. (బుఖారీ-ముస్లిం)
2. ఉపవాసి వల్ల జరిగే
అవాంఛనీయ విషయాలను ప్రక్షాళనం చేయటానికి, సమాజంలోని నిరుపేదల్ని
అభాగ్య జీవుల్ని ఆదుకోవటానికి ఫిత్రాదానం విధిగా చేయబడింది.
(అబూదావూద్)
3. బార్లీ, బియ్యం, కిషమిష్, ఎండు ఖర్జూర్లు, ఉల్లిపాయలు మొదలగు తినే వస్తువుల నుండీ ఒక 'సా' పరిమాణం ఫిత్రాదానంగా
ఇవ్వాలి- ఒక 'సా' పరిమాణం ప్రస్తుతం వ్యవహారంలో ఉన్న
తూనికల ప్రకారం రెండు కిలోల
ఆరు వందల గ్రాములకు సమానంగా ఉంటుంది.
గమనిక: మనం తినే వస్తువులు
అనగా మన ఇండ్లల్లో ఆహారానికై ఎక్కువగా ఉపయోగించే నాణ్యమైన వస్తువులనే ఫిత్రాగా
ఇవ్వాలి. ఉదా:బియ్యం, గోధుమలు.
4. ఈద్గాహకు బయలుదేరే
ముందే ఫిత్రాదానం ఇవ్వాలి.(బుఖారీ-ముస్లిం)
5. నిరుపేదలకు పండుగ
కంటే ముందుగానే ఫిత్రాదానం ఇవ్వటం మంచిది. దానివల్ల వారికి
పండుగ రోజు అడుక్కునే అగత్యం ఏర్పడకుండా ఉంటుంది. (బ్రైహఖీ)
6. కొందరు దైవప్రవక్త
అనుచరుల దృష్టిలో బార్లీ, గోధుమలు, బియ్యం,కిషమిష్స్ ఎండు ఖర్జూర్లు, ఉల్లిపాయలకు బదులు
వాటి మూల్యం దానంగా
ఇవ్వవచ్చు. (అబూదావూద్)
No comments:
Post a Comment